: పాకిస్తానీని పిచ్చిగా ప్రేమించిన ప్రిన్సెస్ డయానా


ప్రిన్సెన్ డయానా పాకిస్థానీ సర్జన్ హస్నత్ ఖాన్ ను పిచ్చిగా ప్రేమించిందట. అతడిని పెళ్లి చేసుకుని, పాక్ కు వెళ్లడానికి కూడా సిద్ధపడిందట. ఈ సంచలన విషయాన్ని పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా ఖాన్ బయటపెట్టింది. జెమీమా, డయానా మంచి స్నేహితులు. తమ మధ్య అనుబంధంతోపాటు, డయానా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రహస్యాలను జెమీమా అమెరికాకు చెందిన వానిటీ ఫెయిర్ మేగజైన్ సెప్టెంబర్ సంచిక కోసం ఆర్టికల్ రూపంలో రాసింది.

డయానా, తాను ఫ్రెండ్స్ గా మారడానికి సర్జన్ హస్నత్ ఖాన్ ను డయానా పిచ్చిగా ప్రేమించడం ఒక కారణంగా జెమీమా సదరు ఆర్టికల్ లో పేర్కొంది. జెమీమా కూడా ఇ్రమాన్ ఖాన్ ను పెళ్లాడి పాక్ కు రావడంతో వీరి మధ్య సఖ్యత కుదిరిందట. పాకిస్తాన్ లో సాధక బాధకాల గురించి డయానా ఆరా తీసిందట. అంతేకాదు పాకిస్తాన్ లో తన ప్రియతమ డాక్టర్ పనిచేసే హాస్పిటల్ కోసం నిధుల సేకరణ పేరుతో డయానా రెండుసార్లు వచ్చిందట. ఆ రెండుసార్లు హస్నత్ ను పెళ్లాడే విషయమై వారి కుటుంబ సభ్యలుతో డయానా చర్చించినట్లు జెమీమా వెల్లడించింది.

అయితే, హస్నత్ తో ప్రేమ వ్యవహారం వికటించాక.. దోడి అల్ ఫయీద్ పై డయానా చూపు మళ్లిందని జెమీమా పేర్కొంది. వారి మధ్య కొత్త అనుబంధం చిగురించిందట. చివరికి 1997లో పారిస్ లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో డయానా హఠాన్మరణం అన్నింటికీ చరమగీతం పాడింది.

  • Loading...

More Telugu News