: కేసీఆర్ శిక్షార్హుడే: బాపిరాజు
ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్ళిపోవాలని వ్యాఖ్యానించిన కేసీఆర్ పై విరుచుకుపడుతున్న సీమాంధ్ర నేతలతో ఎంపీ కనుమూరి బాపిరాజు గొంతు కలిపారు. ఈ విషయమై స్పందిస్తూ, అలాంటి దుందుడుకు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ తప్పక శిక్షార్హుడే అని పేర్కొన్నారు. ఈ ఉదయం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. రాజీనామాలతో ఫలితం లభిస్తుందనుకుంటే తానూ రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.