: రష్యాలో క్షేమంగా స్నోడెన్


మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తరలివెళ్ళిన అమెరికా ఇంటెలిజెన్స్ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ రష్యాలోనే ఓ రహస్య ప్రదేశంలో క్షేమంగా ఉన్నట్లు అతని న్యాయవాది అనటొలి వెల్లడించారు. స్నోడెన్ ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు. స్నోడెన్ ను కలిసేందుకు అతడి తండ్రి లొన్ స్నోడెన్ ను రష్యాకు అధికారికంగా ఆహ్వానించినట్లు చెప్పాడు. ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో న్యాయవాది ఈ విషయాలను చెప్పాడు. పలు దేశాల రహస్య సమాచారాన్ని సేకరించేందుకు అమెరికా గూఢచర్యానికి పాల్పడుతోందంటూ ఎడ్వర్డ్ స్నోడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అప్పటినుంచి పలుచోట్ల తలదాచుకుంటూ కొద్ది వారాల క్రితం రష్యా చేరాడు.

  • Loading...

More Telugu News