: '108' సేవలకు కొత్తవారిని నియమించుకుంటున్న జీవీకే


'108' అత్యవసర వైద్య సేవల ఉద్యోగులు రెండు వారాలుగా చేస్తున్న సమ్మెకు ముగింపు పలకాలని జీవీకే యాజమాన్యం భావిస్తోంది. ఒప్పందం ప్రకారం జీతాలు పెంచాలని ఉద్యోగులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే, సమ్మె కారణంగా '108' అంబులెన్సులు పూర్తి స్థాయిలో తిరగడం లేదు. ఈ నేపథ్యంలో, సమ్మె చేస్తున్న కొంతమందిని తొలగించి కొత్తవారిని నియమించుకునే కార్యక్రమాన్ని జీవీకే యాజమాన్యం చేపట్టింది. ఇప్పటికే తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతోనైనా మిగతా ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లోకి వస్తారని భావిస్తోంది.

  • Loading...

More Telugu News