: కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కృష్ణాజిల్లా ఎన్జీవోలు విధుల బహిష్కరణ
తెలంగాణ ఏర్పడగానే ఆంధ్రా ఉద్యోగులు హైదరాబాదును విడిచి వెళ్లిపోవాలంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కృష్ణాజిల్లా ఎన్జీవోలు విధులు బహిష్కరించారు. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ఉదయం పదకొండు గంటలకు ఎన్జీవోలు మహాధర్నా చేపడతారు. మరోవైపు హనుమాన్ జంక్షన్ లో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షలు చేపట్టారు. అటు జగ్గయ్యపేటలో డిపో నుంచి బస్సులు కదలకుండా ఉద్యమకారులు అడ్డుకున్నారు.