: జమ్మూకాశ్మీర్ లో మరోమారు భూకంపం


24 గంటల వ్యవధిలోనే జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. కిష్త్వార్, దోడా జిల్లాలతోపాటు, లోయలోని పలు ప్రాంతాలలో వేకువజామున 3 గంటల సమయంలో వచ్చిన ప్రకంపనాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే, ఈ ప్రకంపనాలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైనే జాగారం చేశారు. శుక్రవారం ఉదయం కూడా జమ్మూకాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో స్వల్ప భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News