: అండర్‌వేర్లో వజ్రాభరణాల స్మగ్లింగ్‌


సినిమాలు ఈ సెలబ్రిటీ అమ్మడికి స్ఫూర్తినిచ్చాయో లేదా, ఇలాంటి వారిని చూసే సినిమాలు తయారవుతున్నాయో గానీ.. అచ్చం సినిమా ఫక్కీలో అండర్‌వేర్‌లో వజ్రాభరణాలను దాచుకుని ఓ అమ్మడు స్మగ్లింగ్‌కు పాల్పడుతూ.. రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వారికి దొరికిపోయింది. 26 ఏళ్ల ఆ భావ విహారి పొద్దార్‌ ఏదో కడుపు కూటికోసం స్మగ్లింగ్‌ చేస్తున్న బాపతు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆమె ఏకంగా ముంబాయిలోని విహారి జ్యువెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఎండీ. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన సియారాం సిల్క్‌ మిల్స్‌ డైరక్టర్‌ అభిషేక్‌ పొద్దార్‌భార్య.

పెద్దవాళ్లకు కొద్ది బుధ్దులు ఉండడం కొత్త కాదు గానీ.. విహారి పొద్దార్‌ తాజాగా 2.35 కోట్ల విలువైన వజ్రాభరణాల్ని అండర్‌వేర్లలో దాచుకుని స్మగ్లింగ్‌ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ట్విస్టు ఏంటంటే.. ఆమె గతంలో కూడా కనీసం పది సార్లు ఇలా స్మగ్లింగ్‌ కు పాల్పడినట్లుగా వెల్లడించింది.

  • Loading...

More Telugu News