: వాతావరణం వేగంగా మారనుంది


ఇదివరకు ఒక శతాబ్దంలో చోటుచేసుకున్న రకరకాల వాతావరణ మార్పులు రాబోయే రోజుల్లో కేవలం కొన్ని దశాబ్దాల్లోనే చోటు చేసుకుంటాయిట. ఇది పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రపంచం అప్రమత్తం కావాల్సిన అంశంగా వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్టాన్‌ఫర్డ్‌ వుడ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద ఎన్విరాన్‌మెంట్‌ కు చెందిన నోవా డిఫెన్‌ బాగ్‌, క్రిస్‌ ఫీల్డ్‌ లు ఓ పరిశోధన నిర్వహించారు. వాతావరణ మార్పులకు సంబంధించిన శాస్త్రీయ ఫలితాల్ని వారు అనేకం పరిశోధించారు.

ఏతావతా గత ఆరున్నర కోట్ల సంవత్సరాలతో పోలిస్తే.. వచ్చే శతాబ్దంలో వాతావరణ మార్పుల రేటు 10 రెట్లు వేగవంతంగా ఉంటుందని వారు తేల్చారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం వలన.. వస్తున్న మార్పులు ముందురోజుల్లో ఇంకా తీవ్రంగా ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే ప్రపంచం జాగ్రత్త పడడం మొదలైంది. మరింత అప్రమత్తత అవసరం అని వీరి పరిశోధనలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News