: చెత్త మెసేజితో మీకు మరింత హాయి


ఇంట్లో చెత్తను ఎప్పటికప్పుడు ఓ డస్ట్‌బిన్‌లో పడేస్తూ ఇంటిని, ఆఫీసును శుభ్రంగా ఉంచుకోవడం బాగానే ఉంటుంది. కానీ ఆ చెత్తను ప్రతిరోజూ తీసుకెళ్లి బయట పారేయాలంటే మాత్రం చికాకుగా ఉంటుంది చాలామందికి! అలాంటి వారికోసం ఈ అధునాతనమైన చెత్తబుట్టకు రూపకల్పన చేశారు. చెత్తను మనం ఇందులో వేసి.. నిండాక బయట పారేద్దాం అనుకునేలోగా.. ఆ చెత్తను సగం ఇదే మింగేసి ఉంటుంది.

మనం వేసే చెత్తలో దాదాపు మూడింట రెండొంతుల చెత్తను స్వాహా చేసే హైటెక్‌ చెత్తబుట్టను తయారుచేసారు. అంటే వారానికి పది రోజులకో ఓసారి క్లీన్‌ చేస్తే చాలన్నమాట. అయితే అది నిండగానే మనకో ఎస్సెమ్మెస్‌ కూడా పంపుతుందిట.. వచ్చి ఖాళీ చేయమంటూ. ఇది తెలివైన చెత్తబుట్ట లాగే కనిపిస్తున్నది కదూ. దీనికి ఇంధనం కూడా సోలార్‌ ఎనర్జీనేట. 8 గంటలు ఎండలో ఉంటే నెలరోజులు పనిచేస్తుందంటున్నారు తయారీదారులు. ఫీచర్స్‌ బాగానే ఉన్నాయి గానీ.. ధర మాత్రం అక్షరాలా 82 వేలు. దీనిని లండన్‌లో రూపొందించారు.

  • Loading...

More Telugu News