: చిరంజీవీ ఎక్కడ దాగున్నావ్?: దేవినేని ఉమ
పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా చిరంజీవి, కావూరిలపై నిప్పులు చెరిగారు. పదవి కోసం పార్టీని విలీనం చేసిన చిరంజీవి ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పాలని, మంత్రి పదవి దక్కగానే మాట మార్చిన కావూరి సమాధానం చెప్పాలని ఉమ డిమాండ్ చేశారు. దిగ్విజయ్ ను కలిసిన సీమాంధ్ర మంత్రులు ఆయన వాళ్ళ అవినీతి చిట్టా విప్పగానే భయపడి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు.