: పేలుడు ఘటన ఒక మతానికి అంటగట్టడం సరికాదు: ఆజాద్
హైదరాబాద్ పేలుళ్ల సంఘటన కేవలం ఒక మతానికి ఆపాదించడం సరికాదని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. వరుస పేలుళ్లు జరిగిన సంఘటన స్థలాలను ఆజాద్ ఈ సాయంత్రం పరిశీలించారు. అంతకుముందు పేలుడు ఘటన వివరాలను అధికారులు ఆజాద్ కు వివరించారు. అనంతరం సంఘటనా స్థలిని పరిశీలించిన ఆయన చాలా విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు.
తీవ్రవాదుల దుశ్చర్య పట్ల దేశమంతా ముక్తంకంఠంతో సంతాపం తెలిపిందని ఆజాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున బాధితులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు ఆయన చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. వారు స్వదేశీయులైనా, లేక ఏ దేశానికి చెందిన వారైనా వదిలేది లేదని ఆజాద్ హెచ్చరించారు.