: సముద్రం నీరైనా తాగేందుకు రెడీ
మనిషి మేథస్సుకు ప్రకృతి మరోసారి తలవంచుతోంది. భూగోళంపై మూడొంతులు నీరు...ఒక వంతు మాత్రమే భూమి ఉంది. అయినా చుట్టూ సాగరమున్నా చుక్క నీరు మనిషి దాహం తీర్చలేకపోతోంది. అందుకే సముద్ర నీటిని పలు దేశాలు తాగునీరుగా మార్చుకుంటున్నాయి.
ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సముద్రపు నీటిని, మంచినీటిగా మార్చే ప్రాజెక్టును ప్రారంభించింది. దాదాపు 871 కో్ట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత లాంఛనంగా ప్రారంభించారు.