: స్వదేశీ విమాన వాహకనౌక నిర్మాణం 12న ప్రారంభం
దేశీయంగా రూపొందించిన తొలి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ఈ నెల 12న కోచిలోని షిప్ యార్డు లో ప్రారంభించనున్నారు. దీంతో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ తర్వాత ఇటువంటి యుద్ధ నౌకలను రూపొందించే సామర్థ్యంగల దేశంగా భారత్ నిలుస్తుంది. 40,000 టన్నుల బరువును మోయగల ఈ యుద్ధ నౌకను నేవీ డిజైన్ ఆర్గనైజేషన్ రూపొందించింది. దీనిపై రెండు టేకాఫ్ రన్ వేలు, ఒక ల్యాండింగ్ రన్ వే ఉంటుంది. రష్యా తయారీ మిగ్ 29కె జెట్ యుద్ధ విమానాలను దీనిపై మోహరిస్తారు. ప్రస్తుతానికి 83 శాతం ఫ్యాబ్రికేషన్, 75 శాతం నిర్మాణ పని పూర్తయిందని, యుద్ధనౌక ప్రారంభించిన అనంతరం మిగతా పనిని పూర్తి చేస్తామని ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ రాబిన్ ధావన్ చెప్పారు. 2018 నాటికి ఇది ఇండియన్ నేవీకీ అందుబాటులోకి వస్తుంది.