: ఉసురు తీసిన ఉత్ప్రేరకం
లండనులో చదువుతున్న హైదరాబాదీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడ్డాడు. ఫర్నామ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సర్మాద్ అల్లాదీన్ బాడీ బిల్డింగ్ కోసం శరీర బరువుని తగ్గించుకునేందుకు డినిట్రోఫీనల్ టాబ్లెట్లను వేసుకున్నాడు. తర్వాత కొద్ది గంటలకే అతడు చనిపోయాడు.
టాబ్లెట్స్ వేసుకోవడం వల్లే అల్లాదీన్ చనిపోయాడని పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. అల్లాదీన్ వాడిన డినిట్రోఫీనల్ ఉత్ప్రేరకాన్ని అంతర్జాలంలో విస్తృతంగా అమ్ముతున్నారని... వీటిని వాడవద్దని విద్యార్థులకు సూచించారు.
సర్మాద్ అల్లాదీన్ తండ్రి హైదరాబాదులోని సంపన్నులలోఒకరని తెలుస్తోంది. కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే అల్లాదీన్ కుటుంబం లండన్ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.