: రాజీనామా చేశా: జగ్గయ్యపేట ఎమ్మెల్యే
జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ రాజీనామా చేసినట్టు స్పష్టీకరించారు. మీడియాతో మాట్లాడుతూ, రాజీనామా లేఖను స్పీకర్ కు పంపినట్టు తెలిపారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట శాసనసభ్యుడు బండారు సత్యానందరావు కూడా పదవికి రాజీనామా చేశానని, రాజీనామా పత్రాన్ని సభాపతికి పంపానని వెల్లడించారు. శ్రీరాం టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కాగా, బండారు కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడు.