: విభజనను తట్టుకోలేక ఇద్దరు మృతి
రాష్ట్ర విభజనను తట్టుకోలేక చిత్తూరు జిల్లా పెద్ద సముద్రం మండలం రంగ సముద్రం గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. తలారి కిట్టన్న (40), అల్లాపల్లి రవి(40) అనే ఇద్దరు వ్యవసాయ కూలీలు ప్రతి సంవత్సరం పనికోసం హైదరాబాదు వచ్చేవారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించడంతో ఇరువురు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇకనుంచి హైదరాబాదు వెళ్లలేమని, కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుందని కలత చెంది గుండెపోటుతో మరణించారు. దాంతో, మిగతా కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.