: ముగిసిన తొలి రోజు ఆట, ఆసీస్ 316/7
కెప్టెన్ మైకేల్ క్లార్క్ (103) అజేయ సెంచరీ సాధించడంతో మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 6 వికెట్లు కైవసం చేసుకుని ఆసీస్ ను భారీ స్కోరు సాధించకుండా నిలువరించాడు.
అంతకుముందు టాస్ గెలిచి చెన్నయ్ పిచ్ పై బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు అశ్విన్ ధాటికి బెంబేలెత్తి పోయారు. అయితే క్లార్క్.. హెన్రిక్స్ (68) తో కలిసి ఆరో వికెట్ కు 151 పరుగులు జోడించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. జడేజాకు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం క్రీజులో క్లార్క్ కు తోడుగా సిడిల్ (1) ఉన్నాడు.