: కలిసి తింటే కలదు సుఖము
సృజనాత్మకత, సమైక్యతకు సంబంధించిన ఉద్యోగాలు చేసేవారు నలుగురితో కలసి భోంచేస్తుంటే.. వారికి మంచిది. ఎందుకంటే.. మధ్యాహ్న భోజనం సహోద్యోగులతో కలిసి చేయడం అనేది లక్షణం.. మనుషుల్లో సూక్ష్మపరిశీలన శక్తిని తగ్గిస్తుందిట. ఈ రంగాల వారికి అలాంటిది తక్కువ కావడమే మంచిది కాబట్టి.. ఇలా నలుగురితో కలిసి తింటూ ఉండాలిట. అదే సమయంలో నిత్యం లెక్కలను గణాంకాలను పరిశీలించాల్సినటువంటి క్లిష్ట ఉద్యోగాలు చేసేవారైతే.. మధ్యాహ్నాలు ఆఫీసు టేబుల్ దగ్గరే ఒంటరిగా తినేయడం మంచిదని.. అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ విషయంలో బెర్లిన్ హంబాల్ట్ యూనివర్సిటీవారు అధ్యయనం చేశారు. ఆఫీసునుంచి బయటకు వెళ్లి మిత్రుల్తో కలిసి లంచ్ చేసే వారిలో మేధోపరమైన నియంత్రణ తక్కువగా ఉంటుందని వారి అధ్యయనంలో తేలింది.