: బ్యాంకుల్లో మూలుగుతున్న వేలకోట్ల సొమ్ము


జాతీయ బ్యాంకుల్లో వాడుకలో లేని ఖాతాలు, డిపాజిట్ చేసి వదిలేసిన సొమ్ము అక్షరాలా 2, 481 కోట్లు.. ఈ విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్వయంగా వెల్లడించింది. డిసెంబర్ 31, 2011 నాటికి వాడుకలో లేని 1.12 కోట్ల ఖాతాల్లో దాదాపు రెండున్నర వేల కోట్ల సొమ్ము లావాదేవీలేమీ లేకుండా ఉండిపోయిందని ఆర్ బీఐ తెలిపింది. 

పదేళ్లకు పైగా లావాదేవీలు లేకుండా ఉన్న ఖాతాల వివరాలను బ్యాంకు వెబ్ సైట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంచాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది. వీటికి సంబంధించిన డిపాజిటర్లను వెతికి లేదా వారి సంబంధీకుల చేత ఖాతాలను తిరిగి పనిచేసేలా చూడాలని జాతీయ బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది.

అలాగే బ్యాంకింగ్
చట్టాల ద్వారా ఇంత పెద్ద మొత్తంపై వచ్చే వడ్డీని 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్' గా ఉపయోగించాలని ఆర్ బీఐ భావిస్తోంది.

  • Loading...

More Telugu News