: రెండో రాజధాని దక్షిణ భారతదేశంలో: ఉండవల్లి


రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తొలిసారి మీడియా ముందుకొచ్చారు. ఢిల్లీలో నేడు క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, అప్పుడే ఏమీ అయిపోలేదని, సీమాంధ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గాలంటే దేశ రెండో రాజధానిని దక్షిణ భారత దేశంలో ఏర్పాటు చేయాలని పరోక్షంగా హైదరాబాదు అంశాన్ని ఎత్తిచూపారు. ఇదే విషయాన్ని క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సిఫారసు మాత్రమే చేసిందని, అది కార్యరూపం దాల్చేందుకు చాలా సమయముందని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News