: ఆంధ్రా నుంచి ఖాళీ చేస్తున్న తెలంగాణ విద్యార్ధులు


రాష్ట్ర విభజనతో సీమాంధ్ర వారికే కాక తెలంగాణ విద్యార్ధులకు పెద్ద దెబ్బే తగిలిందని చెప్పొచ్చు. ఆంధ్రా ప్రాంతంలోని పట్టణాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్ధులు తిరిగి తమ ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్న చాలామంది విద్యార్ధులు ఆంధ్రాలోని పలు కళాశాలల్లో చదువుకుంటున్నారు. వీరంతా 2014-ఎమ్ సెట్ అర్హత పొందాలంటే సొంత రాష్ట్రంలోనే చదవాలి. దాంతో, ప్రస్తుతం దాదాపు 500 మంది తెలంగాణ విద్యార్ధులు స్వస్థలాలకు మరలుతున్నారు.

ఎంసెట్ నిబంధనల ప్రకారం సొంత రాష్ట్రంలో ఇంటర్ పూర్తిచేసిన వారే పరీక్ష రాయాలి. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ కు చెందిన చాలామంది విజయవాడ, గుంటూరు కళాశాలల్లో చదువుతున్నారు. ఎందుకంటే ఇక్కడే విద్యకు సంబందించిన పేరుపొందిన పలు కార్పోరేట్ కళాశాలలు నారాయణ, శ్రీ చైతన్య గ్రూపు ఇన్ స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎప్పటినుంచో తెలంగాణ నుంచి చాలామంది విద్యార్ధులు విజయవాడ కళాశాలల్లో చదివే ఎంసెట్ కు అర్హత సాధిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రకటనతో తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లక తప్పడం లేదు.

అయితే, రాష్ట్ర విభజన వల్ల విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కొంతమంది అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాదు కళాశాల్లో చదువుతున్న 2వేల పైన విద్యార్ధులు ఇక్కడ ఉన్నారు. వీరు సొంత పట్టణాల్లోనే ఎమ్ సెట్ లో రాసేందుకు తిరుగు ప్రయాణమవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది

  • Loading...

More Telugu News