: పోలీసుల లాఠీఛార్జి, ఉద్యమకారుల ఆగ్రహం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో సమైక్యవాదులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. రైలు ట్రాక్ పై బైఠాయించిన వీరు పట్టాలు తొలగించేందుకు ప్రయత్నించడంతో, పోలీసులు లాఠీఛార్జికి ఉపక్రమించారు. దీంతో ఆగ్రహించిన ఉద్యమకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒక్కసారిగా రాళ్ల వర్షం కురియడంతో పోలీసులు దీటుగా స్పందించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.