: తిలా పాపం తలా పిడికెడు : ఆనం వివేకా


ప్రత్యేక వాదం టీడీపీ హయాంలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని 9 ఏళ్లు దిగ్విజయంగా అణిచివేసిందని ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. 'రెండుకళ్లు' అంటూ తెలంగాణకు అనుకూలంగా బాబు లేఖ ఇచ్చినా, వైఎస్ సమాధి సాక్షిగా తెలంగాణకు అనుకూలమని విజయమ్మ ప్రకటన చేసినా అప్పుడేమీ ప్రమాదం వాటిల్లలేదన్నారు. స్తబ్దుగా ఉన్న ఉద్యమాన్ని తట్టిలేపింది.. వస్తున్నా మీకోసం యాత్ర, ఓదార్పు యాత్రలేనని.. వాటివల్లే తమ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు విభజనకు అనుకూలంగా ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు. తద్వారా రాష్ట్రం ముక్కలయిందన్నారు

హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు అన్నిపార్టీలు ఈ పాపంలో పాలు పంచుకున్నాయని మండిపడ్డారు. తెలంగాణ వాదులు సమైక్యంగా ఉండి విభజన చేసుకోగలిగారని, తాము విడిపోయి నష్టపోయామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని తపించిన నేతల మెడలో చెప్పుల దండలేసి, విగ్రహాలు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టేది లేదని చెప్పిన ఇందిరమ్మ విగ్రహాలను పగులగొట్టడం సరికాదని హితవు పలికారు. విగ్రహాలకు బదులు చంద్రబాబునాయుడు, అంబటి రాంబాబులను తగులబెట్టండి అని వివేకా పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News