: నిందితులైన ఎంపీలపై సుప్రీం తీర్పును వ్యతిరేకించిన పార్టీలు


నిందితులైన ఎంపీలను తాత్కాలికంగా అనర్హులను చేస్తూ, అలాగే, జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని అన్ని పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 5 నుంచి జరగబోతున్నందున ప్రధానమంత్రి అన్ని పార్టీలతో ఈ రోజు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. 16 రోజుల సమావేశాలలో 64 అంశాలను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురావాలని అనుకోవడం సరికాదని విపక్ష నేత సుష్మాస్వరాజ్ అన్నారు. ఉత్తరాఖండ్ విపత్తు, బలహీన ఆర్థిక వ్యవస్థ, రూపాయి విలువ పతనం తదితర అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి.

  • Loading...

More Telugu News