: తదుపరి ప్రధాని మోడీయే కావచ్చు: యశ్వంత్ సిన్హా
భారతదేశం తదుపరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే అవ్వొచ్చని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మనసులో మాటను బయటపెట్టారు. అంతకుముందు వరకు ఈ విషయంపై అంతగా స్పష్టత లేని సిన్హా తాజాగా మోడీకే తన మద్దతును ప్రకటించడం విశేషం. నేడు బీజేపీ-ఆర్ఎస్ఎస్ భేటీలో మోడీ ప్రధాని అభ్యర్ధిత్వంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు. కాగా, బీహార్ సీఎం నితీష్ కుమారే ప్రధానిగా అర్హుడంటూ పార్టీ నేత శత్రుఘ్నసిన్హా చేసిన ప్రకటనపై స్పందించిన సిన్హా.. బీజేపీ ప్రధాని అభ్యర్ధిపై ఏ నిర్ణయమైనా పార్టీ నేతలను, అద్వానీని సంప్రదించి ఏకాభిప్రాయం ద్వారానే తీసుకుంటారని ఓ సలహా ఇచ్చారు.