: మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు పాక్ సుప్రీంకోర్టు సమన్లు
కోర్టు ధిక్కరణ నేరం కింద ఆగస్టు 2న విచారణకు హాజరు కావాలంటూ పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్, తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు అక్కడి సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 28న సుప్రీంకోర్టు, పాక్ ఎలక్షన్ కమిషన్ ను ఉద్ధేశించి ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను ధిక్కారం కింద కోర్టు పరిగణించి సమన్లు జారీ చేసినట్లు జియో న్యూస్ చానల్ పేర్కొంది.