: 2016 కల్లా 'రాయలసీమ రాష్ట్రం' సాధిస్తాం: బైరెడ్డి
2016 కల్లా రాయలసీమ రాష్ట్రం సాధించుకుంటామని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఉద్యమమే ఊపిరిగా ఆగస్టు 8న కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఆయన నిన్న చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్నదే తన డిమాండని చెప్పారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ఇస్తామన్న వారితోనే తాము కలుస్తామని బైరెడ్డి స్పష్టం చేశారు. తన డిమాండుకు మద్ధతునిస్తే బీజేపీతో కలిసి పనిచేస్తానని చెప్పారు.