: మంత్రి గంటా, పితానిలకు విభజన సెగ
విభజనతో మండిపడుతున్న సీమాంధ్రులు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. విశాఖ ఎంవీపీ కాలనీలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని సమైక్యాంధ్ర విద్యార్ధి, ఉద్యోగ సంఘాలు ముట్టడించాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో మంత్రి పితాని సత్యానారాయణ ఇంటిని కూడా ముట్టడించారు. ఇళ్ల ముందు బైఠాయించి మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యమకారులు, తక్షణమే రాజీనామాలు చేయాలని మంత్రులను డిమాండు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రుల నివాసాలకు పోలీసులు భద్రతను పెంచారు.