: అమితాబ్ 'కౌన్ బనేగా క్రోర్ పతి' ప్రోమోపై ఫిర్యాదు


ప్రజాదరణ పొందిన టీవీ క్విజ్ షో 'కౌన్ బనేగా క్రోర్ పతి' ప్రకటనపై కోర్టులో ఓ ప్రయివేటు ఫిర్యాదు దాఖలైంది. త్వరలో సోనీ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ షో ప్రోమో న్యాయవృత్తిని అపఖ్యాతి పాలుజేసే విధంగా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి బాధ్యులుగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటుడు అమితాబ్ బచ్చన్, ఇతరుల పేర్లను చేర్చారు. భోపాల్ లోని 'గోండ్వానా గణతంత్ర పార్టీ'కి చెందిన లీగల్ సెల్ సమన్వయకర్త, న్యాయవాది అయిన నాసిర్ అలీ అనే వ్యక్తి స్థానిక కోర్టులో ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఈనెల 23న దాన్ని విచారణకు స్వీకరిస్తామని కోర్టు తెలిపింది. ఐపీసీ సెక్షన్ 500(అపనింద), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద దానిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారుడు కోరారు.

  • Loading...

More Telugu News