: 2012 ఆగస్టులోనే చెప్పినా ఏం చేశారు ?: టీడీపీ నేత నామా


కొంతకాలం కిందట ఢిల్లీ పోలీసులు పట్టుకున్న ఓ ఉగ్రవాది వెల్లడించిన సమాచారం ప్రకారం 2012 ఆగస్టులో మూడుచో్ట్ల ఐదు నెలల పాటు రెక్కీ నిర్వహించామనీ, అందులో దిల్ సుఖ్ నగర్ కూడా ఉందని చెప్పారని.. అయినా ప్రభుత్వం ముందు జాగ్రత చర్యలు ఏమీ తీసుకోలేదని టీడీపీ పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు.

ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ వైఫ్యలమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజానీకం బాంబు దాడులకు బలవుతుంటే, అరికట్టే చర్యలు ఏమాత్రం తీసుకోవటం లేదని మండిపడ్డారు. దీనిపై పార్లమెంటులో చర్చకు పట్టుబడతామన్నారు. దేశంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందని ఆయన దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News