: నాలుగో వన్డే నేడే.. ప్రయోగాల బాటలో టీమిండియా
జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా ఈ రోజు నాలుగో వన్డే మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో సిరీస్ ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన నాలుగో వన్డే కూడా తమదేనన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రధానంగా జింబాబ్వే జట్టు బలహీనంగా ఉండడంతోపాటు టీమిండియా జోరు మీద ఉండడమే ఇందుకు కారణం. ఇద్దరు ఆల్ రౌండర్లు గ్రేమ్ క్రీమర్, నట్సాయ్ ఎం షాంగ్వే తప్ప మిగతా ఆటగాళ్లను జింబాబ్వే ఇప్పటి వరకూ ఆడించింది. ఎం షాంగ్వేకు మంచి బౌలింగ్ రికార్డున్నా మూడు వన్డేలలోనూ అవకాశం కల్పించలేదు. చివరి రెండు వన్డేలలో ఆడించే అవకాశం ఉంది.
ఇక భారత జట్టు మిగిలి ఉన్న రెండు వన్డేల్లోనూ రిజర్వ్ ప్లేయర్లతో ప్రయోగాలకు సిద్ధమైంది. మోహిత్ శర్మ, పుజారా, రసూల్ లకు అవకాశం కల్పించవచ్చు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.