: ప్లాస్టిక్ వాడకంతో వ్యంధ్యత్వం!
ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ప్లాస్టిక్ లో ఉండే కొన్ని రకాల రసాయనాల వల్ల ప్లాస్టిక్ వినియోగం అత్యధికంగా ఉన్నప్పుడు.. దంపతుల మధ్య ఫలదీకరణలో ఇబ్బందులు ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వాషింగ్టన్‌లో బ్రైగం అండ్ విమెన్స్ హాస్పిటల్‌కు చెందిన కేథరీన్ రకోవ్‌స్కీ ఈ విషయంపై అధ్యయనం నిర్వహించారు.
కొన్ని రకాల ప్లాస్టిక్ తయారీలో బైన్‌ఫెనాల్`ఏ అనే రసాయనం వాడుతారు. ఇది ఫలదీకరణంలో సమస్యలు సృష్టిస్తుందిట. ఈ రసాయనంతో తయారైన ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడే వారిలో సంతానలేమి కనిపిస్తోందని హాస్పిటల్ వారు తేల్చారు. ఈ బైన్‌ఫెనాల్`ఏను ప్రపంచం అంతటా వాడుతున్నందున దీనిపై అవగాహన కలిగిఉండడం మంచిదని వారు సూచిస్తున్నారు.