: ఓవరాల్ ఆధిక్యం తెలుగుదేశం పార్టీదే
మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది. ఫలితాల్లో అధికార కాంగ్రెస్ కు అత్యంత సమీపంలో నిలిచిన తెలుగుదేశం పార్టీ.. ఓవరాల్ గా స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మూడో విడతలో కాంగ్రెస్ (1535) కంటే 20 పంచాయతీలే వెనుకబడి ఉన్న టీడీపీ (1520).. ఓవరాల్ గా 5664 సర్పంచి పదవులతో దూసుకెళుతోంది. మొత్తం మూడు విడతల్లో కాంగ్రెస్ కు 5519 పంచాయతీలు, వైఎస్సార్సీపీకి 3572, టీఆర్ఎస్ కు 2987 పంచాయతీ సర్పంచి పదవులు దక్కాయి.