: మద్దతుదారుణ్ణి గెలిపించుకున్న పయ్యావుల
రాష్ట్ర విభజన అడ్డుకోలేని కాంగ్రెస్ నేతలు .. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తమ స్వగ్రామాల్లో మద్దతుదారుల ఓటమికి పరోక్షంగా కారణమైన సంగతి తెలిసిందే. కాగా, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మాత్రం తన మద్దతుదారుణ్ణి ఘనంగా గెలిపించుకున్నారు. అనంతపురం జిల్లాలో ఆయన స్వగ్రామం పెద్దకవుట్లలో టీడీపీ బలపరిచిన సర్పంచి అభ్యర్థి దాదాపు 1300 పైచిలుకు ఓట్లతేడాతో గెలుపొందాడు.