: కృష్ణా జిల్లాలో టీడీపీ సెంచరీ
మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మెరుగైన ఫలితాలనే నమోదు చేస్తోంది. ఓట్ల లెక్కింపుపై తాజా సమాచారం అందే సమయానికి టీడీపీ కృష్ణా జిల్లాలో పంచాయతీల సెంచరీ పూర్తి చేసింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇప్పటివరకు 107 సర్పంచి పదవులను కైవసం చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ 75, వైఎస్సార్సీపీ 72 పంచాయతీల్లో నెగ్గాయి.