: తెలంగాణ విభజనపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న మమతా బెనర్జీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పశ్చిమ బెంగాల్ లో గూర్ఖాలాండ్ డిమాండ్ మరోసారి రాజుకుంటోంది. జేఎంఎం మూడు రోజుల బంద్ కు పిలుపునిచ్చి జనజీవనం స్థంభింపజేయడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తెలంగాణను విభజించడంతోనే ఈ ఉద్యమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గూర్ఖాలాండ్ పశ్చిమబెంగాల్ లో అంతర్భాగమని, తామంతా సమైక్యంగా ఉంటామని అన్నారు. పశ్చిమ బెంగాల్ ను ముక్కలు చేసే ప్రశ్నేలేదని మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముక్కలు చేయడానికే కంకణం కట్టుకుందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని ఆమె కాంగ్రెస్ ను దుయ్యబట్టారు.