: వీడియోకాన్ నుంచి చవకైన స్మార్ట్ ఫోన్.. ధర రూ.4,699
ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ వీడియోకాన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. వీడియోకాన్ ఏ24గా వ్యవహరించే ఈ చవక ఫోన్ ను మధ్య తరగతి, అల్పాదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. దీని ధర కేవలం 4,699 రూపాయలని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆధునిక ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేసే ఈ మొబైల్ 1.2 గిగాహెర్ట్ జ్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్ తో పలు రంగుల్లో లభ్యమయ్యే వీడియోకాన్ ఏ24.. 256 ఎంబీ ఇంటర్నల్ మెమరీ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కు రెండు కెమెరాలు ఉంటాయి. వెనుకవైపు 3.2 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 0.3 మెగాపిక్పెల్ కెమెరా అమర్చారు. ఇక రెండు సిమ్ కార్డుల సౌలభ్యం, వై-ఫై, జీపీఆర్ఎస్ ఎడ్జ్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ చవక ఫోన్ స్వంతం.