: పదవులకు అమ్ముడుపోయిన కావూరి, శీలం: ధూళిపాళ్ల నరేంద్ర
కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం పదవులకు అమ్ముడుపోయారని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్రకుమార్ విమర్శించారు. పొన్నూరు ఐలాండ్ సెంటర్లో సోనియా గాంధీ, ప్రధాని దిష్ఠి బొమ్మలు దహనం చేసి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిన్నటి వరకు సమైక్యనినాదంతో పనిచేసిన కావూరి, జేడీ శీలం కేంద్ర మంత్రులు కాగానే తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సీమాంధ్రప్రాంత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.