: కంచుకోటలో జగన్ పార్టీ జోరు
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా పరిగణించే కడప జిల్లాలో వైస్సార్సీపీ దూసుకెళుతోంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తాజా సమాచారం అందే సమయానికి ఆ పార్టీ 54 సర్పంచి పదవులు నెగ్గి ప్రత్యర్థులకందనంత దూరంలో నిలిచింది. ఆ జిల్లాలో అధికార కాంగ్రెస్ కు 12, టీడీపీకి 6 సర్పంచి పదవులు దక్కాయి. తొలి రెండు విడతల్లోనూ ఇక్కడ వైఎస్సార్సీపీ మద్దతుదార్లకే ఓటర్లు పట్టం కట్టిన సంగతి తెలిసిందే.