: రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి సమైక్యంగా ఉండాలి: చంద్రబాబు


రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి సమైక్యంగా ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ అభిప్రాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలుగు జాతి, ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రేగకుండా నిర్ణయాలు చేయాలని కేంద్రానికి సూచించారు. అనివార్య కారణాలతో రెండు రాష్ట్రాలు ఏర్పడినా ఇరు ప్రాంతాల మధ్య ద్వేష భావాలు ఉండరాదని బాబు అన్నారు. ఇరు ప్రాంతాల సమస్యల పరిష్కారాలన్నింటినీ బిల్లులో పొందుపరచాలని డిమాండు చేశారు.

విభజనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు ఈరోజు తన నివాసంలో మాట్లాడారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా 2008లో కేంద్రానికి లేఖ పంపామని, ఆ లేఖకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని తెలిపారు. కొత్త రాష్ట్రం, రాజధాని చాలా ఖర్చుతో కూడుకున్నదన్న ఆయన, కొత్త రాజధాని ఏర్పాటుకు నాలుగు లేదా ఐదు లక్షల కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామన్న మాటను కేంద్రం నిలబెట్టుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News