: దావూద్, చోటా షకీల్ లను పట్టుకుంటాం: ఢిల్లీ కొత్త పోలీస్ చీఫ్


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు చోటా షకీల్ లను పట్టుకుని తీరుతామన్న నమ్మకం ఉందని న్యూఢిల్లీ కొత్త పోలీస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన భీమ్ సేన్ బాసి తెలిపారు. ఐపీఎల్ ఆరవ సీజన్ లో సంచలనం సృష్టించిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో దావూద్ పాత్ర కూడా ఉందని బయటపడటంతో ఛార్జిషీటులో వారిద్దరి పేర్లు నమోదయ్యాయి. దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీస్ చీఫ్.. దావూద్ పై చార్జిషీటు నమోదుకావడం తొలిసారి కాదని, అయినా అరెస్టు చేయడం సాధ్యంకాలేదన్నారు. అయితే, ఈ పర్యాయం ఓ పద్ధతి ప్రకారం అన్నీ జరుగుతాయన్నారు. కాగా, దశాబ్దం తర్వాత దావూద్ పేరు ఓ ఛార్జిషీటులో నమోదు కావడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News