: కాంగ్రెస్.. ఏపీ ప్రజలను 'డోర్ మ్యాట్లు'గా పరిగణిస్తోంది: మోడీ
తెలంగాణ ప్రకటన నేపథ్యంలో గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను 'కాళ్ళు తుడుచుకునే పట్టలు'గా పరిగణిస్తోందని మండిపడ్డారు. తొమ్మిదేళ్ళుగా తెలంగాణ అంశాన్ని నాన్చుతూ వచ్చిన కాంగ్రెస్, ఇప్పటికిప్పుడు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడం చూస్తుంటే ఓట్లకోసమే ఈ తాపత్రయమన్న భావన కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ తన బ్లాగులో అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణపై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెబుతూ, ప్రకటన వెలువడిన సమయం సరైనది కాదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం వెలిబుచ్చిందని ఆయన మండిపడ్డారు.