: మళ్లీ జారిపడ్డ రూపాయి


రూపాయిని కాపాడాలంటూ రిజర్వ్ బ్యాంకు చేస్తున్న ప్రయత్నాలు కించిత్ ప్రయోజనం లేకుండా పోతున్నాయి. ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ 61.20కు పడిపోయింది. రూపాయి జీవిత కాల కనిష్ఠ స్థాయి 61.21 జూలై 8న నమోదైంది. రూపాయి విలువ పతనాన్ని ఆపేందుకు రిజర్వ్ బ్యాంక్ గత రెండు నెలలుగా పలు చర్యలు తీసుకుంటూ వస్తోంది. బంగారం దిగుమతులపై ఆంక్షలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్పెక్యులేషన్ కు చెక్ పెట్టేందుకు ద్రవ్య లభ్యతను కట్టడి చేస్తూ చర్యలు తీసుకుంది. దీంతో రూపాయి 61 స్థాయి నుంచి కోలుకుని 59.30 వరకు రికవరీ అయింది. కానీ, నిన్న ద్రవ్యపరపతి ప్రకటనతో మళ్లీ రూపాయి 'పీచే ముడ్' తీసుకుంది.

కీలక వడ్డీ రేట్లను తగ్గించి వృద్ధికి ప్రోత్సాహం కల్పించాలని పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక మంత్రి నుంచి డిమాండ్లు వచ్చినా... రిజర్వ్ బ్యాంకు ద్రవ్యపరపతి సమీక్షలో పట్టించుకోలేదు. రూపాయి విలువ కాపాడడం, కరెంటు ఖాతా లోటును కట్టడి చేసే దిశగా కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేకుండా పోయిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రకటించారు. కానీ, ఆయన ఒకటి చెబితే.. రూపాయి మరో దిశలో పయనం ప్రారంభించింది. రానున్న రోజుల్లో రూపాయి మరింత పతనం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆటుపోట్లు మొదలవడంతో రిజర్వ్ బ్యాంకు మళ్లీ జోక్యం చేసుకునే అవకాశం ఉందని డీలర్లు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News