: మంత్రి ఏరాసు ఇంటిని ముట్టడించిన సమైక్యాంధ్ర వాదులు


న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డికి విభజన సెగ తగిలింది! కర్నూలులోని ఆయన నివాసాన్ని ఈ ఉదయం సమైక్యాంధ్రవాదులు ముట్టడించారు. మంత్రి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన వారిలో విద్యార్థి సంఘాల నేతలు, పలు పార్టీల నాయకులు ఉన్నారు. ఇక జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో ఆర్టీసీ సిబ్బంది రోడ్డుపై వంటావార్పూ కార్యక్రమం చేపట్టి తమ నిరసన తెలియజేశారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ.. సోనియా, మన్మోహన్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు.

  • Loading...

More Telugu News