: సీమాంధ్రుల కోపం కొన్నాళ్ళే: వీహెచ్
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం పట్ల సీమాంధ్రుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబకడం సహజమేనని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రుల ఆవేదన అర్థం చేసుకోదగినదే అంటూ, అయినా, వారి కోపం కొన్నాళ్ళలోనే చల్లారిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇక రగిలిపోతున్న సీమాంధ్ర నేతలను బుజ్జగించాల్సిన బాధ్యత సీఎం కిరణ్ తో పాటు తమపైనా ఉందని చెప్పుకొచ్చారు.