: ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మగౌరవాన్ని నిలబెడితే, బాబు కాలరాశాడు: శైలజానాథ్
విభజన నేపథ్యంలో మంత్రి శైలజానాథ్ ఈ ఉదయం హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. దివంగత ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడితే, చంద్రబాబు నాయుడు కాలరాశాడని దుయ్యబట్టారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని పదేపదే చెబుతున్న బాబు.. సీమాంధ్రలో రగిలిపోతున్న ప్రజలకు జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని చెబుతూ, ఇప్పటికీ కొన్ని అవకాశాలున్నాయన్నారు. నిర్ణయం మార్చుకునేలా అధినాయకత్వాలపై ఆయా పార్టీల నేతలు ఒత్తిడి తేవాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు.