: పేలుళ్ల ఘటనపై పాక్ ఖండన
హైదరాబాద్ వరుస పేలుళ్ల ఘటనపై పొరుగుదేశం పాకిస్తాన్ పెదవి విప్పింది. నిన్న జరిగిన ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. వివిధ రూపాల్లో విస్తరించిన టెర్రరిజం ప్రపంచ శాంతికి ముప్పులా తయారైందని పేర్కొంది.
ఇలాంటి దుశ్చర్యలను సమర్థించలేమని పాక్ విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయ ప్రతినిధి మొజాం ఖాన్ అన్నారు. ఓ తీవ్రవాద బాధిత దేశంగా పాకిస్తాన్.. భారత్ అనుభవిస్తున్న క్షోభను అర్థం చేసుకుంటుందని, అక్కడి ప్రజల వేదనను పంచుకుంటుందని ఆయన చెప్పారు.