: ఏమో మనిషే ఎగరావచ్చు!


అంతగా ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు. మాయ లేదు మంత్రం లేదు.. తావీదు మహిమ అసలే కాదు.. అచ్చంగా మనలాంటి మనిషే.. కాకపోతే.. ఎప్పటినుంచో 'ఎగరడం' గురించి రకరకాల ప్రయోగాలు చేస్తున్న మనిషి. ఆ దిశగా అనల్పమైన ఉత్సాహం ఉన్న మనిషి. కనుకనే.. గంటకి 190 మైళ్ల వేగంతో ఎగిరి వెళ్లగల పరిజ్ఞానాన్ని ఇప్పుడు తయారుచేసి... నిరూపిస్తున్నాడు.

అమెరికాలోని యాపిల్టన్‌లో ఈవ్‌ రాసీ అనే వ్యక్తి.. రెక్కల్లాంటి ఉపకరణాలను శరీరానికి తగిలించుకుని, వాటికి ఇంజిన్లు అమర్చి గాలిలో ఎగిరే పద్ధతిని ఆవిష్కరించాడు. ఈవ్‌ రాసీ.. నాలుగు ఇంజిన్లు గల కార్బన్‌ కెప్లర్‌ జెట్‌ వింగ్స్‌ను శరీరానికి తగిలించుకున్నాడు. దాని సాయంతో ఎగరడం సాధ్యమైంది. దీంతో 12వేల అడుగుల ఎత్తువరకు ఎగరడం కుదురుతుందని రాసీ అంటున్నాడు. స్విట్జర్లాండ్‌కు చెందిన రాసీ.. ఈ రంగంలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు. ఇతణ్ని స్థానికంగా జెట్‌మ్యాన్‌ అని పిలుస్తుంటారట.

  • Loading...

More Telugu News