: వెలుగు తగ్గుతున్న శతాబ్దపు తోకచుక్క


ఏడాది కిందట కొందరు ఔత్సాహిక శాస్త్రవేత్తలు కనుగొన్న ఓ కొత్త తోకచుక్క.. అంచనాల ప్రకారం.. పగటి సమయంలో కూడా కనిపించేంత పెద్ద తోకను అభివృద్ధి చేసుకుని అలరించాల్సి ఉన్నది గానీ.. ఏ రకంగా అది తన తేజస్సును కోల్పోతోందని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడిని సమీపిస్తున్న కొద్దీ.. ఆ తోకచుక్క మీద.. మంచు మొత్తం కరిగిపోయి.. దాని తేజస్సు తగ్గిపోతోందని వారు భావిస్తున్నారు. ఏడాది కిందట ఇంటర్నేషనల్‌ సైంటిఫిక్‌ ఆప్టికల్‌ నెట్‌వర్క్‌ (ఇసాన్‌) అనే తోకచుక్కను రష్యా శాస్త్రవేత్తలు ఇద్దరు కనుగొన్నారు. ఇది నవంబరు 28న సూర్యుడికి అత్యంత చేరువ కావాల్సి ఉంటుంది. అంటే సౌరమండలానికి అది 12 లక్షల కిమీల దూరంలో ఉంటుంది. అప్పుడు దానికి పగలు కూడా కనిపించేంత పెద్ద తోక ఏర్పడుతుందని భావించారు.

ఈ శతాబ్దపు తోకచుక్కగా అంచనా వేసిన ఇసాన్‌ ఇప్పుడు.. సెకనుకు 26కిమీల వేగంతో సూర్యుడివైపు వెళుతూ వెలుగు కోల్పోతోందని గుర్తించారు. మంచు కరగడం కారణం అని.. ఆంటియోక్వియో విశ్వవిద్యాలయానికి చెందిన ఇగ్నాసియో ఫెర్రిన్‌ చెబుతున్నారు. పైగా దీనిపై సిలికేట్‌ పొర పేరుకున్నదట. అయితే ఈ తోకచుక్క గురించి చర్చించడానికి శాస్త్రవేత్తలు త్వరలో సమావేశం కాబోతున్నారు.

  • Loading...

More Telugu News