: మూకుమ్మడిగా పోరాడుదాం..ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిద్దాం: యనమల
కాంగ్రెస్ నిర్ణయంపై మూకుమ్మడిగా పోరాడుదామని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిద్దామని అన్నారు. ఇప్పడు కాంగ్రెస్ చేసింది కేవలం ఆ పార్టీ ప్రకటన మాత్రమేనని, ఇది కేంద్రం నిర్ణయం కాదని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. అందుకే దీన్ని పార్టీలకు అతీతంగా వ్యతిరేకిద్దామని యనమల పిలుపునిచ్చారు.